ఐ విడుదలకు అడ్డంకులు
వాయిదాలు పడుతూ వస్తున్న ‘ఐ’ సినిమా విడుదలకు ఇబ్బందులు తప్పటం లేదు. మొదట దీపావళికి వస్తుందనుకున్న ఈ సినిమా
పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఆలస్యం వల్ల మూడు నెలలు ఆలస్యంగా విడుదలకు
సిద్దమవుతోంది. సంక్రాతి కానుకగా సినిమా వస్తుందని మూవీ యూనిట్ ప్రచారం
మొదలు పెట్టేందుకు సన్నాహాలు చేసుకుంటోంది. మరోవైపు ఈ సినిమా విడుదల
కాకుండా అడ్డంకులు వస్తున్నాయి. తెలుగు వర్షన్ విడుదల ఆపేయాలని ప్రస్తుతం
ఫిలిం ఛాంబర్ లో కేసు నడుస్తోంది. ఈ కేసు ప్రపంచ వ్యాప్తంగా సినిమా
విడుదలను వాయిదా వేసుకునేలా చేసే అవకాశం ఉంది.
‘ఐ’ మనోహరుడు సంక్రాంతికి విడుదల కావద్దంటూ నిర్మాత బండ్ల గణేష్ తెలుగు
సినిమాల నిర్మాతల మండలిలో కేసు పెట్టారు. డబ్బింగ్ సినిమాలు పండగల సమయంలో
విడుదల చేయవద్దనే నిబంధన ప్రకారం కంప్లయింట్ ఇచ్చారు. దీనిపై విచారణ
జరుగుతోంది. నిబంధన ప్రకారం బండ్ల వాదన కరెక్టే. అయితే ఈ సినిమా తెలుగు
వర్షన్ హక్కులు నిర్మాతల మండలి పెద్దల చేతుల్లో ఉన్నాయి. దీంతో వారు ఎలా
తీర్పు చెప్తారనేది తెలియాల్సి ఉంది.
ఒకవేళ నిబంధనల ప్రకారం తెలుగు వర్షన్ సినిమాను అడ్డుకుంటే మాత్రం..,
దీని ప్రభావం మిగతా భాషల్లో చిత్ర విడుదలపై కూడా పడే అవకాశం ఉంది.
ఎందుకంటే. ప్రపంచ వ్యాప్తంగా ఒకేసారి సినిమా విడుదల చేసి కలెక్షన్లు
కొల్లగొట్టాలని శంకర్ ప్లాన్. అలా కాకుండా తెలుగు వర్షన్ మాత్రం వాయిదా
వేసుకుంటే.., తర్వాత విడుదల అయినా ఇక్కడ మార్కెట్ జరగక నష్టపోతారు. కాబట్టి
ఏం చేస్తారు.. ఎలా చేస్తారు అని ‘ఐ’ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. దీనిపై
సినీ విశ్లేషకులు రెండు సలహాలు ఇస్తున్నారు. పండగకు వారం రోజులు ముందు
అయినా విడుదల చేయాలి లేదా పండగ తర్వాత వారం రోజులకు అయినా విడుదల చేయాలి
అని సూచిస్తున్నారు. వారం రోజులు ముందు అంటే థియేటర్ల అడ్జస్ట్ మెంట్,
ప్రమోషన్లు ఇతర ఇబ్బందుుల వస్తాయి. అదే వారం రోజుల తర్వాత అయితే పండగ ఫీవర్
తగ్గి కలెక్షన్లపై ప్రభావం పడుతుందని మూవీ యూనిట్ భావిస్తోంది.
బండ్ల గణేష్ లేటెస్ట్ మూవీ ‘టెంపర్’ కూడా సంక్రాంతికి విడుదల
అవుతుందనుకున్నారు. కానీ అనివార్య కారణాలతో పిబ్రవరి 5కు వాయిదా పడింది.
దీంతో తెలుగులో పండగకు వస్తున్న సినిమా ‘గోపాల గోపాల’ మాత్రమే. దీనికి
శంకర్ సినిమాతో పోటి ఏర్పడిందని అంతా అనుకుంటున్నారు. నిబంధన ప్రకారం
‘మనోహరుడు’ వాయిదా పడితే.., పండగ కలెక్షన్లంతా పవన్-వెంకీ మూవీకే వస్తాయి.
సోలోగా పండగను స్వీప్ చేసుకుపోతారు.
ఐ విడుదలకు అడ్డంకులు
Reviewed by Unknown
on
22:00
Rating:
Reviewed by Unknown
on
22:00
Rating:

No comments: