రామ్ చరణ్, బన్నీల మల్టీస్టారర్ ఫిల్మ్ !
టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం మల్టీస్టారర్ ఫిల్మ్స్ ట్రెండ్
ఊపందుకుంది. చిన్న హీరోలు అంతా కలిసి నటించి, అది మల్టీస్టారర్ అంటే,
దానిని సాధారణ సినీ ప్రేక్షకులు సైతం అంగీకరించడంలేదు. అలా వచ్చిన కొన్ని
తెలుగు మూవీలు బాక్సాపీస్ వద్ద బోల్తా కొట్టిన విషయం ప్రాక్టికల్ గా
తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా మెగా హీరోలు తీసుకున్న నిర్ణయం టాలీవుడ్
ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. మెగా హీరోలు అయిన రామ్ చరణ్,
అల్లు అర్జున్ ఇద్దరూ కలిసి ఓ మూవీలో నటించే అవకాశం ఉంది.
దీనికి సంబంధించి కథా చర్చలు జరుగుతున్నట్టుగా టాక్స్ వినిపిస్తుంది. గతంలో
వీరిద్దరూ కలిసి ఎవడు మూవీలో నటించారు. అయితే రామ్ చరణ్ నటించిన ఎవడు
మూవీలో అల్లుఅర్జున్ కాసేపు కనిపించినా, వీరిద్దరి కాంబినేషన్ బాక్సాపీస్
వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దీంతో మరోసారి ఈ మెగా హీరోలు కలసి ఫుల్
లెన్త్ రోల్ లో నటిస్తే, అది నిజాంగా అతి పెద్ద మల్టీస్టారర్ మూవీగా మారే
అవకాశం ఉందని అంటున్నారు.
ప్రస్తుతం కథా చర్చల్లో ఉన్న ఈ మల్టీస్టారర్ మూవీకి, కథ ఫైనల్ అయిన తరువాత,
మూవీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు రిలీజ్ అవుతుంది వంటి వివరాలు
బయటకు రానున్నాయి. టాలీవుడ్ లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం వీరిద్దరి
కాంబినేషన్ మూవీ 2017 సంక్రాంతి కానుకగా రావొచ్చని అంటున్నారు. ఈ లోపు ఈ
ఇద్దరి మెగా హీరోలు, వీరు ఒప్పుకున్న ప్రాజెక్ట్స్ ని పూర్తి చేసే పనిలో
ఉంటారని టాలీవుడ్ టాక్స్.
రామ్ చరణ్, బన్నీల మల్టీస్టారర్ ఫిల్మ్ !
Reviewed by Unknown
on
19:29
Rating:
Reviewed by Unknown
on
19:29
Rating:

No comments: