పవర్ ప్లస్ విక్టరీ సూపర్ కెమిస్ట్రీ
పవన్‌కళ్యాణ్, వెంకటేష్ ఇద్దరూ డిఫరెంట్ మైండ్ సెట్‌తో ఉంటారు. ఇద్దరికీ ఎలా కలిసిందోగానీ, ఇద్దరి అంతరంగం ఒకేలా ఉంటుందట. అదే ఆ ఇద్దరినీ కలిపింది. పవన్‌కళ్యాన్‌కి సమాజం పట్ల బాధ్యత ఎక్కువ. వెంకటేష్‌కి ఆధ్మాతిక అంశాలపై మక్కువ ఎక్కువ. వెంకటేష్ కారణంగా పవన్‌కళ్యాణ్‌కీ ఆధ్యాత్మిక భావాలు ఎక్కువైపోయాయి. ఎవరితో అయినా ఈజీగా కలిసిపోవడం వెంకటేష్ స్పెషాలిటీ. 'మేముసైతం' ఈవెంట్‌లో వెంకటేష్ ఎంత అల్లరి చేశాడో చూశాం.
అదే అల్లరి 'గోపాల గోపాల' ఆడియో ఈవెంట్‌లోనూ చేశాడాయన. సినిమా షూటింగ్‌లో పవన్, వెంకీ ఇంకెంత అల్లరి చేసి వుంటారో అనుకున్నవారికి రోలింగ్ టైటిల్స్‌లో ఆ ఇద్దరూ కలిసి చేసిన మ్యాడ్ డాన్స్ సూపర్ కిక్ ఇచ్చింది. పవన్ కళ్యాణ్‌తో ఒక్క సినిమానే కాదు, ఇంకా చాలా సినిమాలు చేయాలని ఉందని వెంకటేష్ చెప్పడం వెనుక కారణమేంటో ఇది చూస్తేనే తెలుస్తుంది.
పవర్ ప్లస్ విక్టరీ సూపర్ కెమిస్ట్రీ
Reviewed by Unknown
on
09:30
Rating:
Reviewed by Unknown
on
09:30
Rating:

No comments: