త్రిష ఎంగేజ్ మెంట్ జనవరి 23న
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోయిన్ ఫిల్మ్ కెరీర్ ని లీడ్ చేసిన
హీరోయిన్ త్రిష. దాదాపు గత 15 సంవ్సత్సరాలుగా సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో,
సక్సెస్ ఫుల్ గా ఆఫర్స్ ని అందుకుంటున్న ఆందాల భామ త్రిష, ఎట్టకేలకు
పెళ్ళికి సిద్ధపడింది. గత కొంత కాలంగా ఆమెకు అవకాశాల సంఖ్య తగ్గినా, వచ్చిన
ఆఫర్స్ అన్నీ స్టార్ హీరోలతోనే చేస్తూ వస్తుంది. ఇదిలా ఉంటే త్రిష,
పారిశ్రామికవేత్త, తమిళ నిర్మాత వరుణ్ మణియన్ తో ప్రేమలో ఉందని, త్వరలో
పెళ్లి చేసుకోనుందనే వార్తలు నిజమవుతున్న సమయం దగ్గరపడింది.
ఈ విషయాన్ని త్రిష ఇప్పుడు అఫిషియల్ గా అనౌన్స్ చేసింది. ‘నా ఫ్రెండ్స్, నా
అభిమానులు మరియు మీడియా మిత్రులకు నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే జనవరి
23న వరుణ్ తో నా ఎంగేజ్ మెంట్ జరగనుంది. ఈ కార్యక్రమం చాలా ప్రైవేటుగా నా
కుటుంబ సభ్యుల మధ్య జరగనుంది.
ప్రస్తుతం మా పెళ్లి డేట్ గురించి వస్తున్న
వార్తలను నమ్మవద్దు.
ఎందుకంటే అందులో వాస్తవం లేదు. డేట్ ఫిక్స్ అయ్యాక నేనే చెప్తాను. పెళ్లి
చేసుకోబోతున్నాను కదా అని నేను సినిమాలు చేయడం ఆపేయడం లేదు. చెప్పాలంటే
త్వరలోనే మరో రెండు కొత్త సినిమాలకు సైన్ చేయనున్నాను. ఈ సంవత్సరం మొత్తం
నావి 4 సినిమాలు రిలీజ్ అవుతాయని’ త్రిష ట్విట్టర్ ద్వారా తెలియజేసింది.
త్రిష ప్రస్తుతం తెలుగులో బాలకృష్ణ సరసన ‘లయన్’ సినిమాలో, తమిళంలో అజిత్
సరసన ‘ఎన్నై అరింధాల్’ సినిమాల్లో నటిస్తోంది.
త్రిష ఎంగేజ్ మెంట్ జనవరి 23న
Reviewed by Unknown
on
21:37
Rating:

No comments: