చిరు 150వ సినిమాపై వర్మ ట్వీట్
వివాదాల దర్శకుడు
ఎప్పుడు ఏదో ఒక ట్వీట్ చేస్తూనే అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటాడు. తాజాగా
ఈయన మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా గురించి ట్విట్టర్‌లో ట్వీట్
చేశాడు. గతంలో వర్మ పలు సార్లు ఈ విషయంపై ట్వీట్ చేశాడు. కాని ఈసారి కొంత
భిన్నంగా వర్మ ట్వీట్ చేసి మీడియా దృష్టిని ఆకర్షించాడు. చిరంజీవి తన 150వ
సినిమాకు సొంతంగా దర్శకత్వం చేయాలని, అలా చేయకపోతే అంత కంటే పెద్ద తప్పు
మరోటి ఉండదంటూ ట్వీట్ చేశాడు.
వర్మ ఇంకా మాట్లాడుతూ.. త్రివిక్రమ్, వినాయక్‌ల కంటే కూడా చిరంజీవి తన
150వ సినిమాకు తానే దర్శకత్వం చేస్తే ఎక్కువ న్యాయం చేసుకుంటాడని,
చిరంజీవికి ఎన్నో విషయాలు తెలుసని, ఆయనతో మాట్లాడిన సమయంలో తనకు ఆ విషయాలు
అర్థం అయ్యాయి అంటూ వర్మ చెప్పుకొచ్చాడు. ఒక వేళ తన 150వ సినిమాకు
దర్శకత్వం వహించకపోతే, పార్టీ పెట్టి ఎంత తప్పు చేశాడో, అంతకు పెద్ద తప్పు
చేసినట్లుగా తాను భావిస్తున్నట్లుగా వర్మ చెప్పుకొచ్చాడు. ఇలా చిరుపై వర్మ
చేసిన ట్వీట్లు ప్రస్తుతం మీడియా వర్గాలతో పాటు సినీ వర్గాల్లో కూడా
చర్చనీయాంశం అవుతున్నాయి. మంచి కథ దొరికితే చిరంజీవి స్వయంగా దర్శకత్వం
చేయాలని భావిస్తున్నట్లుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో వర్మ ట్వీట్‌కు
ప్రాధాన్యత సంతరించుకుంది.
చిరు 150వ సినిమాపై వర్మ ట్వీట్
Reviewed by Unknown
on
19:28
Rating:
Reviewed by Unknown
on
19:28
Rating:

No comments: